telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : ఫేక్ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు షాక్

Harijka

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-4 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది అనే టాక్ నడుస్తోంది. ఆర్భాటంగా ప్రారంభమైన ఈ షో ఇప్పుడిప్పుడే ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హౌస్‌లో క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన లాస్యే మొద‌టి కెప్టెన్‌గా నిలిచింది. త‌ర్వాత నోయ‌ల్ ఈ వారం వెళ్లిపోతానంటూనే రెండో కెప్టెన్‌గా ఎన్నిక‌య్యాడు. ఈ వారానికి గానూ అభిజిత్‌, గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సోహైల్‌, క‌ళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి స‌భ్యులు నామినేట్ కాగా… శనివారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

ఇక సండే ఫన్ డే రోజున శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయిన కళ్యాణి నాగార్జున వద్దకు వచ్చారు. ఆమెతో టాప్ 5..లీస్ట్ 5 ఎవరో చెబుతూ ఫోటోలు పెట్టమన్నారు నాగార్జున. లీస్ట్ 5 లో సోహైల్ (5), సుజాత (4), అరియానా గ్లోరీ (3), కుమార్ సాయి (2), గంగవ్వ (1) ఫోటోలను ఉంచారు కల్యాణి. తరువాత దేత్తడి హారిక (1), ‘అమ్మ’ రాజశేఖర్ (2), మోనాల్ (3), దివి (4), అభిజిత్ (5) ఫొటోలను టాప్ 5 లిస్టులో పెట్టారు కల్యాణి. ఈ సందర్భంగా సుజాత పై విపరీతంగా విరుచుకు పడ్డారు కళ్యాణి. దీని తరువాత బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తారు అని అడిగారు నాగార్జున. బిగ్ బాంబ్ ఏమిటంటే వచ్చేవారం ఎవరినైనా ఒకరిని నేరుగా నామినేషన్ లో పెట్టాలి. దానికి కళ్యాణి వెంటనే దేవి నాగవల్లి పేరు చెప్పారు. దీంతో వచ్చే వరం దేవి నేరుగా నామినేషన్ కు వెళ్ళిపోయారు. ఇక తరువాత ఎలిమినేషన్ నుంఛి బయట పడిన పేర్లను ఒక్కోటీ రివీల్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరకు దేత్తడి హారిక..మోనాల్ ఇద్దరూ మిగిలారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి వెళ్ళిపోక తప్పదు అని చెప్పారు. అయితే, ఆ ఎవరనేది..నామినేషన్ లో లేని ఏడుగురు నిర్ణయిస్తారని చెప్పారు నాగార్జున. దానికి రెండు రంగుల నీళ్ళు తెప్పించి హారిక ముందు ఒకటి.. బౌల్స్ పెట్టి దానిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటే వారి బౌల్ లో రంగు నీళ్ళు పోయాలని చెప్పారు. మొదటి ఆరుగురు ఇద్దరికీ సమానంగా నీళ్ళు పోశారు. స్కోరు సమానం అయింది. ఈ దశలో సుజాత మిగిలిపోయింది. ఆమె నిర్ణయం కీలకమైంది. దీంతో ఆమె హారిక బౌల్ లో రంగునీళ్ళు పోసింది. ఇక హారిక ఎలిమినేట్ అయిపోయిందని నాగార్జున ప్రకటించారు. ఇక్కడ నుంచి హౌస్ లో డ్రామా మొదలైంది. అందరూ హరికను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. హాగ్ లు .. ముద్దులతో ఆమెకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధం అయిపోయి గేటు వద్దకు తీసుకు వెళ్లారు. అప్పుడు నాగ్ హారిక ను వెనక్కి వెళ్ళమని చెప్పారు. దీంతో అందరూ కేరింతలు కొడుతూ ఆమెను వెనక్కి తీసుకువచ్చారు.

మొత్తమ్మీద ఫేక్ ఎలిమినేషన్ తో ఎమోషన్స్ పెంచి టీఆర్పీలు లాగాలని ప్లాన్ చేసినట్టు కనిపించింది. కాకపోతే, హారిక ఎలిమినేట్ అవుతుంది అని ప్రేక్షకులు ఎవరూ భావించకపోవడం కొసమెరుపు. ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. గంగవ్వ.. కుమార్ సాయిల మధ్య జరిగిన సరదా ఆటను చెప్పుకోవాలి. అదేవిధంగా కల్యాణి వెళుతూ వెళుతూ శ్రీరాముని వంశ వృక్షం గుక్కతిప్పుకోకుండా హరికథ రూపంలో చెప్పడం ఆకట్టుకుంది. ఇక ఒక పక్క ఐపీఎల్ ప్రారంభం అయి.. అతి పెద్ద రియాల్టీ షో కు సవాల్ విసురుతోంది. మరో పక్క వంటలక్క ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో పదిహేను రోజులు గడిచిపోయినా..ప్రేక్షకులను టీవీల ముందు కూచోపెట్టేలా ఎటువంటి సహకారమూ బిగ్ బాస్ నిర్వాహకులకు కంటెస్టెంట్ ల నుంచి దొరకడం లేదు. ఈ నేపధ్యంలో ఈ శని ఆదివారాలు నాగార్జున తో క్లాస్ పీకించి.. అందరినీ ఆడించేలా చేయాలని ఫేక్ ఎలిమినేషన్ స్టోరీ నడిపించి షోపై ఆసక్తిని పెంచారు.

Related posts