కరోనా మహామ్మారి కారణంగా మన దేశంతో పాటు మొత్తం ప్రపంచం స్థంభించిపోయింది. మన దేశంలో కరోనా వైరస్ ఉదృతి తగ్గకపోవడంతో మరో 19 రోజులు పాటు కేంద్రం లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుతో పాటు చాలా భాషల్లో ఉన్న నటీనటులు తమ వంతు విరాళంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సినీ తారలు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అద్భుతమైన పాటను విడుదల చేశారు. కరోనా వైరస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారి సేవల్ని కొనియాడాడు. ఈ పాటకు మంచు లక్ష్మీ కూతురు సైతం గళం కలిపింది. చిన్నారి విద్య నిర్వాణ సైతం మామయ్య తో కలిసి పాట పాడింది. ఈ పాటకు లిరిక్స్ కాశర్ల శ్యాం అందించారు. అచు రాజమణి సంగీతం అందించారు. ఇలాంటి సమయంలో స్టెతస్కోప్ పట్టుకున్న డాక్టర్, లాఠీ పట్టుకున్న పోలీస్, తుపాకి పట్టుకున్న ఆర్మీ, నాగలి పట్టుకున్న రైతు, చీపురు పట్టుకున్న పారిశుధ్య కార్మికుడు మన కోసం మనల్ని ఆదుకునేందుకు దేవుళ్ల రూపంలో వచ్చారంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చారు మంచు మనోజ్.
Here is a tribute to all the police, doctors and municipal staff who are working round the clock to keep us safe 🙏🙏🙏#AnthaBaguntamra
Music composed by my friend @achurajamani sung by me and my niece @VidyaNirvana ❤️❤️❤️https://t.co/bxhPj0waob— MM*🙏🏻❤️ (@HeroManoj1) April 19, 2020