telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌లో దంచికొట్టిన‌ వాన‌..లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

*హైద‌రాబాద్‌లో దంచికొట్టిన‌ వాన‌
*జూబ్లీహీల్స్ బంజారాహీల్స్ లోభారీ వ‌ర్షం
*లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

జూబ్లీహిల్స్,బంజారాహీల్స్, పంజాగుట్ట, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ లో వర్షం కురిసింది.
దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎండ కొట్టినా.. మధ్యాహ్నం అయ్యే సరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది.

మ‌రోవైపు తెలంగాణ‌లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ… ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం నిపుణులు వెల్లడించారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్ల‌డించారు.

Related posts