telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త అవతారం ఎత్తనున్న మాస్‌ మహారాజు !

Raviteja

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు.  ఇదిలా ఉంటే మాస్‌ మహారాజ్‌ గురించి ఇప్పడొక వార్త వైరల్‌గా మారింది. త్వరలో రవితేజ నిర్మాతగా మారనున్నాడని.. చిన్న బడ్జెట్‌ సినిమాలతో పాటు ఓటీటీలకు సూటయ్యే వెబ్‌ సిరీస్‌లను నిర్మించాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తుండగా.. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

Related posts