telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. విశ్రాంతి అవసరం .. కుటుంబంతో గడపడం మేలు..

today rasi falalu

మేషం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఏదైనా దూర ప్రదేశానికి కానీ, ఆధ్యాత్మిక కేంద్రానికి కాని వెళ్లి ప్రశాంతంగా గడపాలి అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు కాదు. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందికి లోనవుతారు.

వృషభం : రోజు ఒక సంఘటన మీ మనస్సును చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

మిథునం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్త పరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూల దినం.

కర్కాటకం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

సింహం : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడానికి అనుకూల దినం. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలుమెరుగవుతాయి. సంతానం గురించి ఎదురుచూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

కన్య : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశముంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ ఉంటుంది.

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం, బాగు చేయించడం చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

ధనుస్సు : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగేయండి.

మకరం : ఈ రోజుకొంతబద్దకంగాఉంటుంది. చిన్నపనికి అయినా ఇతరులపై ఆధారపడటంకానీ, ఇతరులసాయంతీసుకోవడంకానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలోఅనుకోనిసమస్యకారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగేమిత్రులతోఅభిప్రాయభేదాలుఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కుంభం : ఈ రోజుఆర్థికలావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగాఉంటుంది. గతంలోపెట్టినపెట్టుబడులకుమంచిలాభాలుగడిస్తారు. మీ సంతానంకారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువసమయం గడుపుతారు అలాగే కొత్తస్నేహాలు, పరిచయాలుఏర్పడతాయి. ప్రేమవ్యవహారాలు ఒకకొలిక్కివస్తాయి.

మీనం : ఈ రోజుమీరు చాలాకాలంనుంచిఎదురుచూస్తున్నపనులు ఒకకొలిక్కివస్తాయి. ఉద్యోగంలోఅనుకూల మార్పుఉంటుంది. మీపనికి గుర్తింపు లభిస్తుంది. మీపైఅధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగాఉత్సాహంగాఉంటారు. మీసంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీఆలోచనలు కార్యరూపందాలుస్తాయి.

Related posts