మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీటర్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దాదాపు రెండు వారాల పాటు షూట్ అక్కడే కొనసాగనున్నట్లు సమాచారం. ‘‘చిరు నటిస్తున్న 153వ చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది.
“ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
మూవీ మాఫియా “మణికర్ణిక”ను చంపాలనుకుంది… కంగనా సంచలన వ్యాఖ్యలు