పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండటం తో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. కొంత మంది హీరోలు మాత్రం ఇప్పట్లో షూటింగ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో లేరని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సర్కారు వారి పాటలో జేజెమ్మ అనుష్క నటించబోతుందట. ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ… సమాచారం మేరకు సర్కారు వారి పాటలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనుందట. ఇంతకు ముందు మహేశ్, అనుష్క జోడీగా “ఖలేజా’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత వీరి జోడీ తెరపై మెప్పించనేలేదు. మరీ ఈ సినిమాలో అనుష్క నటిస్తుందా? లేదా? అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
previous post