telugu navyamedia
ఆరోగ్యం

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచండిలా..

కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తికి పెంచేందుకు పనిచేసే ఆహారాలేంటో చూద్దాం.

*సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో విటమిన్-డి, జింక్. సెలినీయం, విటమిన్-ఈ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇది ప్రోటీన్లకు మంచి వనరు. శిశువుల్లో శక్తిని అందించి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

*సాల్మన్ చేపలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది నొప్పిని నివారించి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది.

*బాదంలో విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే కొన్ని బాదం గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని పిల్లలకు స్నాక్స్ రూపంలో అందిస్తే మంచిది. అధికబరువు తగ్గడంలోనూ బాదం గింజలు తోడ్పడుతాయి.

*పిల్లలకు సులభంగా జీర్ణమై.. మంచి చేకూర్చే ఆహారం పెరుగు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా వేడిని కూడా తగ్గిస్తుంది.

*బెర్రీలు.. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం బెర్రీలు. ఇవి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. సులభంగా జీర్ణమయ్యే ఈ ఆహారం మంచి డైట్ గాను ఉపయోగపడుతుంది.

*బ్రకోలీ.. పిల్లలకు ఇచ్చే ఆహారాల్లో బ్రకోలి అత్యంత ఆరోగ్యకరమైంది. అంతేకాకుండా పోషకాలకు పవర్ హౌస్ గా పనిచేస్తుంది. ఫలితంగా చిన్నపిల్లల్లో ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

*ఓట్ మీల్.. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర విలువైన పోషకాలు కూడా పుష్కలంగా దొరుకుతాయి. చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం కావడంతో పాటు రోగకారక క్రిములను నిరోధించడంలో ఓట్ మీల్ సహాయపడుతుంది. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.

*క్యారెట్లు పిల్లల పెరుదలకు, ఆరోగ్యానికి విటమిన్ ఎ , జింక్ చాలా ముఖ్యం. అందుకే వారి ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకోండి. క్యారెట్‌తో కంటిచూపు మెరుగు అవుతుంది. దాంతో వారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ.. ఉంటుంది. అందువల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది.

Related posts