telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి… కుక్కను షాపుకి పంపిన యజమాని

dog

కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే పోలీసుల అనుమతి తీసుకునే బయటకు వస్తున్నారు. ఇక సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండే పరిస్థితి మరింత దారుణం. వారు అస్సలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. తన కావల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు తన పెంపు కుక్క సాయాన్ని తీసుకున్నాడు. ఆంటోనియో మునాజ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడికి ‘చీటోస్’ తినాలని అనిపించింది. వాటిని తేవడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఐసోలేషన్‌లో ఉన్న అతడు బయటకు వెళ్తే పోలీసులు జైల్లో పాడేస్తారు. దీంతో ఇంట్లో ఖాళీగా తిరుగుతున్న కుక్కను వాడుకోవాలనే ఐడియా వచ్చింది.

మెదడులో మెదలిన ఆ ఐడియాతో ఒక చీటి రాసాడు. హాయ్, షాప్‌కీపర్ నా కుక్క కాలర్‌కు 20 డాలర్లు పెట్టా. అవి తీసుకుని ‘చీటోస్’ ఇవ్వండి. నాకు ఆరెంజ్ కలర్ చీటోస్ ఇవ్వండి. రెడ్ కలర్ వద్దు అవి చాలా ఘాటుగా ఉంటున్నాయి అని ఆ చీటిలో రాశాడు. దాన్ని కుక్క మెడకు ఉండే బెల్టుకు పెట్టాడు. అనంతరం దాన్ని షాప్‌కు వెళ్లాలని ఆదేశించాడు. ఆ కుక్క నేరుగా షాపుకే వెళ్లింది. సరిగ్గా షాప్ కీపర్ దగ్గరకు వెళ్లి చీటిని ఇచ్చింది. షాప్ కీపర్ కూడా జాగ్రత్తగా చీటి, డబ్బులు తీసుకొని చీటోస్ ప్యాకెట్ దాని నోటికి ఇచ్చాడు. దీంతో ఆ కుక్క దిక్కులు చూడకుండా నేరుగా యజమానికి ఆ ప్యాకెట్‌ను అందించింది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Related posts