telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాతిరిని వరించిన మహిళలు

రాతిరిని వరించిన సంధ్యలు
చీకటిలో వికసించే ఒంటరి పువ్వులు
చుక్కలు పుట్టేనాటికి మెరిసే తళుకులు
రక్తాన్ని పీల్చే మృగాల కోసం
పూసుకున్న కన్నీటి అత్తరులు
వ్యధలతో అక్కఱ చేయిస్తున్న కృత్యాలు
శీలానికే శిలువలు వేసుకున్న కడగండ్ల కలువలు
చిరిగిన విస్తరాకుల జీవితాలు
గౌరవానికి ఏమాత్రం నోచుకోని బతుకులు
ఇవి మలిన పడ్డ దేహాలే…!! కాని
స్వచ్చమైన పాలవెల్లి మనసులు
ఆకలి పేర్చిన పాన్పు మీద
బిడ్డ అవసరాల గదిలో కాలిపోతున్న పువ్వులు
కాలరాత్రిలోనే పుట్టి కర్కశమైన ధాత్రిలో
ముగిసిపోతున్న అందమైన జీవితాలు
మరుజన్మకైనా గౌరవంగా బతికే బతుకునిమ్మని కోరుకుంటూ పడక పడకకి చస్తూ బతుకుతూ
గదిలో దుప్పటి మార్చే ప్రతిసారి
చేసే పాపానికి ఎన్ని వేళ సార్లు కుమిలిపోయిందో
పాలిచ్చే రొమ్ములను అమ్ముకున్న ప్రతిసారి
మగ వ్యభిచారుల చేతిలో ఎంతటి నరకాన్ని
అనుభవించిందో
ఇవేవి ఎవరికి కాబట్టావు
ఆమెని ఓ సంఘ ద్రోహిగా చూడడమే తెలుసు…!!
న్యాయాన్ని ధర్మాన్ని దేశాన్నీ
అమ్ముకునే పెద్దనుషులకంటే
ఆమె ఎంతో నయం కాదంటారా…???
అందాన్ని అంగడి వస్తువులా కొనుక్కుంటూ
మాతృత్వాన్ని వాంచిస్తున్న ఈ సమాజం
చేసేది వ్యభిచారం కదా…???
ఆమెని అలా మార్చి చోద్యం చూసున్న
సంఘానిది తప్పుకాదా…???
ఇది మన దేశానికి పట్టిన దౌర్బాగ్యం కదా…??
వేదభూమి కర్మ భూమి అంటూ
రాముడు ఏలిన ఈ దేశంలో
ఆడదానికి ఈ దుస్థితి ఏంటో ఎప్పుడు మారుతుందో….

Related posts