telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఏకైక కథానాయకుడు తలైవా !!

Rajinikanth actor
రంగులో ఏముంది ?
అతనున్నది నలుపు
నవ్వారు హేళనగా తెల్లతోలు లేదని !
ఆ నలుపుతోనే ఆకట్టుకున్నాడు
నవ్విన నాపచేను పండినట్టుగా
వెటకారం చేసిన వారినే !
చిరునవ్వు తెలుపుతో
తేజరిల్లే ముఖ వర్ఛస్సుతో !
రూపంలో ఏముంది
బక్కపలచనోడని
దేనికీ పనికి రావన్నారు కర్కశంగా !
గడ్డం నెరిసింది
జులపాల జుట్టు రాలింది
అయినా
ఇంతితై వటుడింతైనట్టుగా
ఒక్కొక్క మెట్టెక్కుతూ
కోట్లాది అభిమానులను సంపాదించాడు
ఆకట్టుకునే ఆహార్యపు నటనతో
ఇదికదా సూచిక !
అంతర్గత మేధస్సుకు మెచ్చుతునక
ప్రతిభనెప్పుడూ
రంగు హంగు పొంగు చూసి
అంచనా వెయ్యద్దు !
కొలమానం చెయ్యద్దు !
నిదర్శనం
ఈ రజనీ( నల్లని చీకటి )
కాంత్ ( చిక్కటి వెలుగు )
ఉన్నతే నిరూపణ
కాలేదా
ప్రపంచ వెండితెరపై
అద్భుత మెరుపులా !
కోట్లాది అభిమానులను పొంది
సినీ వినీలాకాశంలో వెలుగుతున్న ధృవతారగా
ఏకైక కథానాయకుడు తలైవాగా !

Related posts