telugu navyamedia
సినిమా వార్తలు

‘టక్‌ జగదీష్‌’ శివ పాట.. నాని ఆట..

నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివా నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. ఇందులో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు..

Nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Sep 10th

ఈ సినిమా కోసం దర్శకుడు శివ మొదటిసారి గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని క్యారెక్టర్‌ తెలియజేేసలా రూపొందించిన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటను ఆయన ఆలపించారు. సీమ యాసలో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలుత ఈ పాటను దర్శకుడు, సంగీత దర్శకుడు హీరో నానితో పాడించాలనుకోగా.. నాని కోరిక మేరకు దర్శకుడే పాడినట్లు చూపించారు.

With 'Tuck Jagadish' and 'Maestro' taking the digital route, the OTT Vs. theatre tussle continues - The Hindu

నిజానికి ఈ సినిమాను తొలుత థియేటర్లలో విడుదల చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కరోనా వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడి ఎట్టకేలకు చిత్ర యూనిట్ ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీ వేదికగా విడదుల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టక్‌ జగదీష్‌ అమేజాన్‌ వేదికగా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 10న విడదుల కానుంది.

تويتر \ Chay. على تويتر: "Nani Ritu Varma Aishwarya Rajesh. The casting of  Tuck Jagadish promises a sure shot success material. Wish all glory to one  of the highly talented actors of

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలోని మరో పాటను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. తాజాగా విడుదలైన పాటకు గోపీసుందర్‌ స్వరాలు అందించారు. ఈ పాట విడుదలైన కేవలం కొద్ది క్షణాల్లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Exclusive: Tuck Jagadish Closes Deal for 37 Cr

Related posts