telugu navyamedia
రాజకీయ వార్తలు

బెంగాల్‌ ఘటనలపై నివేదిక కోరిన కేంద్రం

TDP Mla anitha comments Roja YCP

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. హింసాత్మక ఘటనల కారకులపై తీసుకున్న చర్యలు చెప్పాలని సూచింది. హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని తెలిపింది. 2016లో 509 ఘటనలు చోటుచేసుకోగా 2018లో అది 1,035కు చేరుకుందని పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే 773 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపింది.

మృతుల సంఖ్య ఏటికేడాది పెరుగోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2016లో 36 మంది మరణించగా, 2018లో ఆ సంఖ్య 96కు చేరిందన్నారు. ఈ ఏడాది జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందినట్లు పేర్కొంది. శాంతిభద్రతలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నామంది. వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.

Related posts