telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది: బీజేపీ నేత లక్ష్

BJPpresident -K-Laxman

ఆర్టీసీ కార్మికు బలిదానాలతో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ కేంద్రంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అశాంతి, అసంతృప్తి నెలకొన్నట్లు వెల్లడించారు. పోలీసుస్టేషన్‌లో ఉండాల్సిన పోలీసులు బస్‌ డిపోలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ఉంటున్నారని ఆరోపించారు.

ఇవాళ కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కుతున్నాయని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడ వారికి మద్దతు తెలుపుతారో అని భయపడి వారితో చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Related posts