*తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి..
*కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే ఆర్హత లేదు
*బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
బీజేపీ మహిళా నాయకులు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ….కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే ఆర్హత లేదని అన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే రాష్ర్టపతి పాలన విధించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.స్పెషల్ ఫ్లైట్స్‌లో పక్క రాష్ట్రాలకు తిరగడానికి డబ్బుంది కానీ.. పంట కొనడానికి కేసీఆర్ సర్కార్ దగ్గర డబ్బు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.