telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్​పైనే కక్ష్య ..ప్రభుత్వ అలసత్వం వల్లే వ‌ర‌ద‌లు .

రాష్ర్టంలో ఈ నెల 16వ తేదీ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. సోమవారం నాడు సీఎల్పీ సమావేశం హైద‌రాబాద్‌ లో జరిగింది.

ఈ సమావేశంలో మల్లుభట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు.

రాష్ట్రంలో వరద నష్టంను అంచనా వేయటంలోనూ ప్రభుత్వం విఫలమైందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో చోటు చేసుకొన్న పరిస్థితుల ను తెలుసుకొనేందుకు గాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నామని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

ఈ నెల 16 నుండి భద్రాచలం నుండి సీఎల్పీ బృందం వరద ప్రభావిత ప్రాంతాల నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 

కాళేశ్వ‌రం, క‌డెం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ తీరును కూడా సీఎల్పీ బృందం పరిశీలించనుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన వివరించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ప్రతి జిల్లాలో 75 కి.మీ పాద‌యాత్ర నిర్వహించాలని కూడా సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క వివరించారు

స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్​పైనే కక్ష్యకట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారు. సోనియాగాంధీని, రాహుల్​గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని భ‌టి ఆవేద‌న వ్యక్తం చేశారు.

 

 

Related posts