telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

srinivas goud minister

రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారిందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు హైద్రాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండడం బీజేపీ చూడలేకపోతుంద అన్నారు. అన్ని మతాల, కులాల పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదని విమర్శించారు. . హుజుర్‌నగర్‌లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించుకోవాలన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని మెచ్చుకుంటుంటే రాష్ట్ర బీజేపీకి మాత్రం కనిపించడం లేదా? అని ప్రశించారు. సీఏఏ, ఎన్నార్సీ బిల్లు తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా ఉందన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుంది మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Related posts