telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మరో భారీ విగ్రహ ఏర్పాటు … 251 మీటర్ల ఎత్తు ..

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టిస్తామని తెలిపారు. రాముడి విగ్రహం 251 మీటర్ల ఎత్తుతో, గుజరాత్‌లోని 183 మీటర్ల సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్-ఐక్యతా విగ్రహానికన్నా ఎత్తుగా ఉంటుందన్నారు. దీన్ని గుజరాత్ సాంకేతిక సహకారంతో 100 ఎకరాల విశాల ప్రదేశంలో ఏ ర్పాటు చేస్తామన్నారు. అన్నివిధాల అయోధ్య అభివృద్ధికి ప్రణాళిక సిద్ధంచేస్తున్నామన్నారు.

పర్యాటక వసతులతోపాటు డిజిటల్ మ్యూజియం, గ్రంథాలయం, ఫుడ్ ప్లాజా, పార్కింగ్, ప్రకృతి రమణీయతతో కూడిన తోటలను శ్రీరాముడి ఇతివృత్తంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ మేరకు పనుల పర్యవేక్షణకు సీఎం ఆధ్వర్యంలో ఓ ట్రస్టు ఏర్పాటుకానున్నది. ఐఐటీ కాన్పూర్, నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆరై) సాయంతో స్థల సర్వే, పర్యావరణ అంచనా, సాధ్యతపై అధ్యయనం చేపడతామని యూపీ సర్కార్ ప్రకటించింది.

Related posts