మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా కర్రలోడును తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఏడుగురు కూలీలను రంగారెడ్డి జిల్లా ]వారిగా గుర్తించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..?: జగన్ తీవ్రవ్యాఖ్యలు