బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఐదు పదుల వయస్సులోను ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిందో లేదో వెంటనే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్.. కేసరి, బ్లాంక్, మిషన్ మంగళ్, హౌజ్‌ఫుల్ 4 చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్ చిత్రాలు విడుదల కావలసి ఉంది. తాజాగా అక్షయ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సారి ప్రధాన పాత్రలో కాకుండా సినిమాలో భాగం అవుతున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్న దుర్గావతి చిత్రాన్ని అక్షయ్ కుమార్ సమర్పించనున్నాడట. ఇందులో భూమి ఫడ్నేకర్ లీడ్ రోల్ పోషిస్తుంది. అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నెలలో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. థ్రిల్లర్ మూవీగా దుర్గావతి చిత్రం రూపొందనుందని అంటున్నారు.
previous post