telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హైపర్ కమిటీపై … హైటెన్షన్ .. రాజధాని రచ్చ..

ap map

ఏపీకి రాజధాని పై స్పష్టత కోసం నియమించిన హైపవర్ కమిటీ నేడు సమావేశం కానుంది. మంత్రి బుగ్గన నేతృత్వంలో పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్, పేర్ని నాని, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హైపవర్ కమిటీలో సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ సీఎస్ నీలం సాహ్ని కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. వీరంతా సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ కమిటీ.. జీఎన్‌రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ అధ్యయనాలపై హైవపర్ కమిటీ విచారించనుంది.

రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమం చేస్తున్నట్లు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తెలిపారు. చినకాకాని వద్ద జాతీయ రహదారిపై జరిగే కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న హేతుబద్దత లేని ఆలోచనా విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జగన్‌ చేష్టలతో ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. జగన్‌ ఆడుతున్న రాజకీయ క్రీడలు ప్రజలు సమిదలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts