telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుడ్ న్యూస్ : ఇంటి నుంచే ఇక కరోనా టెస్ట్.. కొత్త కిట్టుకు అనుమతి

“ర్యాపిడ్ యాంటీజెన్” టెస్ట్ కిట్ ద్వారా ఇంటి వద్ద స్వయంగా “కోవిడ్” టెస్ట్ చేసుకోవచ్చు. ఈ మేరకు “ఐసీఎంఆర్” కీలక సూచనలు జారీ చేసింది. అయితే దీన్ని విచ్చలవిడి వినియోగం సరికాదని వెల్లడించింది. “కోవిడ్-19” పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి క్లోజ్ కాంటాక్ట్ లేదా లక్షణాలతో బాధపడుతన్నవారు మాత్రమే చేసుకోవాలని పేర్కొంది ఐసీఎంఆర్. “హోం టెస్టింగ్” మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని…టెస్టింగ్ విధానం గురించి యాప్ లో సమాచారం పొందుపర్చి ఉంటుందని పేర్కొంది. టెస్ట్ చేసిన తర్వాత స్ట్రిప్ ను ఫొటో తీసి యాప్లో పొందుపర్చాలని…యాప్‌లో పొందుపర్చిన సమాచారం “ఐసీఎంఆర్-కోవిడ్-19” పోర్టల్ లో భద్రంగా ఉంటుందని వెల్లడించింది. రోగి వ్యక్తిగత సమాచారం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. “కోవిడ్” పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన వారికి మరలా “టెస్ట్” అవసరం లేదని తెలిపింది. లక్షణాలున్నవారికి ఇంటివద్దనే నిర్వహించే టెస్టులో నెగెటివ్ వస్తే, “ఆర్టీ-పీసీఆర్” టెస్టు చేయించుకోవాలని ఐసీఎంఆర్ పేర్కొంది.

Related posts