telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ అలవాట్లు ఉన్నవారికే.. కరోనాతో చనిపోయే ప్రమాదం ఎక్కువట !

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వైరస్‌ అందరికీ సోకుతూనే ఉంది. అయితే.. కరోనా వైరస్‌ వ్యాపించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకుంటే ప్రమాదం ఉండదు. కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మందులు తీసుకోవాలి. అప్పుడే మనల్ని రక్షించుకోగలం. అయితే.. కరోనా వైరస్‌ వ్యాపించిన వారికి ఈ చెడ్డ అలవాట్లు ఉంటే బతకడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రంగా ఉంచుకోనివారికి, సిగరేట్లకు, బీడీలకు అలవాటైన వారికి, మద్యం ఎక్కువ తాగే వారికి ప్రమాదం ఎక్కువ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలోనే ఉంటుందని అంటున్నారు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారు కూడా కరోనా రాకుండా జాగ్రత్త పడాలని, వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నోటి పరిశుభ్రతకు కరోనా వైరస్‌కు సంబంధం ఉందని పరిశోధన చేసిన నిపుణులు చెబుతున్నారు. అందుకే పాన్‌, పారక్‌ వంటివి తీసుకోకపోవడం చాలా ఉత్తమం. 

Related posts