తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు తెల్లవారుజామున శ్రీవారినిదర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆలయ వేదపండితులు ఆలయ మర్యదాల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
నిన్న సాయంత్రం కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. వైసీపీ తరపున గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌కు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందచేశారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. దర్శనం అనంతరం ఆయన తిరిగి మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు.
కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది: పవన్