telugu navyamedia
రాజకీయ వార్తలు

మక్కా, మదీనాల్లో కర్ఫ్యూ..సౌదీ అరేబియా కీలక నిర్ణయం

saudi released 95 lakhs to hajj yatra disciple

ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలపై కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. అంతేాకాదు ఈ ప్రాంతాల్లో తిరిగే కార్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది.

సౌదీలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 20 మందికి పైగా మరణించారు. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశం లాక్ డౌన్ విధించింది. అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది. ఇతర దేశాల ప్రజలు మక్కా, మదీనా కోసం ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని ఇప్పటికే ప్రకటించింది.

Related posts