telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన నిర్ణయం…

aadi

మూడు రోజల కింద వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు. పోలీసుల కాళ్ల వేళ్ల పడ్డా కూడా లాభం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ కమెడియన్ల భవిష్యత్తు ఏంటనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వీళ్ల టీం లీడర్ హైపర్ ఆది కూడా ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే మాత్రం మరో రెండు మూడు వారాలు అయితే కచ్చితంగా దొరబాబు కనిపించడు. దొరబాబు కూడా ఇంతకుముందు బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంతలోనే ఇలా జరిగిపోయింది. అయితే ఈ ఇద్దరి విషయంలో మల్లెమాల ప్రొడక్షన్స్ సీరియస్‌గానే స్పందించినా కూడా వాళ్లు మాత్రం నిజానికి చాలా మంచి వాళ్లే అని సర్టిఫికేట్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వాళ్ల విషయంలో తుది నిర్ణయం మాత్రం హైపర్ ఆదికి వదిలేసినట్లు తెలుస్తుంది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. కొన్ని వారాలు ఈ వేడి చల్లారేంత వరకు వాళ్లను జబర్దస్త్‌కు దూరం పెట్టి తర్వాత మళ్లీ తీసుకురావాలని హైపర్ ఆది చూస్తున్నాడని తెలుస్తోంది.

Related posts