telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి…!

larence

లారెన్స్ తమ్ముడు తనను మోసం చేసి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది వరంగల్‌కు చెందిన దివ్య. లారెన్స్ తమ్ముడు విన్నీ ప్రేమను తిరస్కరించినందుకు తనను వేధింపులకు గురిచేశాడంటూ దివ్య మీడియా కెక్కడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసుకులకు ఫిర్యాదు చేస్తే.. సీఐతో కుమ్మక్కై తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపారని ఆరోపిస్తోంది ఆ యువతి. జైలు నుండి విడుదలైన తరువాత కూడా వేధింపులు ఆగలేదని ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది ఆర్టిస్ట్ దివ్య. తనపై కక్షసాధింపు చర్యల్లో పోలీసులు లారెన్స్ తమ్ముడితో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తోంది దివ్య. ఏసీపీ రవీందర్ రెడ్డి తనపై బ్రోతల్ కేసు పెట్టి 21 రోజులు జైలుకు పంపారని, విచారణ పేరుతో లాడ్జిలకు రమ్మని నీచంగా మాట్లాడేవారంటూ వాపోయింది దివ్య. స్టేషన్‌కి పిలిచి తెల్లకాగితంపై బలవంతంగా సంతకం చేయించుకుని తనపై బ్రోతల్ కేసు పెట్టారు. గాంధీ హాస్పటల్‌కి తీసుకుని వెళ్లి ఏవేవో తప్పుడు పరీక్షలు జరిపించి జైలుకు పంపారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది దివ్య. అయితే దివ్యకు లారెన్స్ తమ్ముడు ఎల్విన్‌కి పాతగొడవలు ఉన్నాయని ఆ అమ్మాయి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ వివరణ ఇచ్చారు ఏసీపీ రవీందర్ రెడ్డి. .

Related posts