telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సినిమా వార్తలు

జగనంత “జీవిత”మ్ మాది – రాజశేఖర్ .

Jeevitha Rajasekhar Join YSRCP
జీవితా రాజశేఖర్ మళ్ళీ పార్టీ మారారు . వాళ్ళు ఏపార్టీలోను స్థిరంగా వుండరు . ఏ పార్టీ లోనైనా చేరిందాకా ఒకటే సందడి . తీరా చేరిన తరువాత మరో పార్టీ వైపు చూడటం . ఇది  రాజశేఖర్ జీవిత అలవాటు . ఎక్కడా వారు కొన్నాళ్ల పాటు వున్నా దాఖలాలు లేవు . ఎందుకు పార్టీలో చేరతారా మారేందుకు మారతారో వారికే తెలియాలి . 
Jeevitha Rajasekhar Join YSRCP
కాంగ్రెస్ , తెలుగు దేశం , భారతీయ జనతా పార్టీ  ఇప్పుడు ఎన్నికలు హాట్ హాట్ గా ఉండగా ఈ ఇద్దరు దంపతులు హైద్రాబాద్లోని జగన్ నివాసానికి వెళ్లి వై .ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు . ఆ తరువాతకుటుంబంతో పాటు  ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు . 
ఆ తరువాత జీవిత రీజినల్ సెన్సార్ బోర్డు చైర్మన్ గా  నియమితులయ్యారు . భారతీయ జనతా పార్టీలో చేరినందుకు ఆ పార్టీ ఇచ్చిన కానుక సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి . ఇప్పుడు హఠాత్తుగా జగన్ పార్టీలో చేరారు . ఈ మధ్య చాలామంది సినిమా వారు జగన్ పార్టీ వైపు చేస్తున్నారు . ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని వీరంతా నమ్ముతున్నారు . అందుకే ఇప్పుడు జీవిత , రాజశేఖర్ జగన్ దగ్గరకు వెళ్లారు .
Jeevitha Rajasekhar Join YSRCP
ఈ మధ్యనే జీవిత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్  కార్యదర్శిగా ఎన్నికయ్యారు . రాజశేఖర్ కూడా మా లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు . జీవితా రాజశేఖర్ వై .ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసే అవకాశం వుంది . 
ఏమైనా రాజశేఖర్ “జీవిత “ము …  జగన్ మోహనం అయ్యింది  

Related posts