telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కాంత్ కు కరోనా

Vijaykanth

కోలీవుడ్ సీనియర్ నటుడు, డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కు కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. చెన్నై మనపాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స తీసుకుంటున్నారు. గత వారం డీఎండీకే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో విజయకాంత్ పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా మహమ్మారి సోకడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, తన అభిమానులను మెప్పించిన విజయ్ కాంత్ ఆపై రాజకీయాల్లోకి వచ్చి, డీఎండీకే పేరిట పార్టీని పెట్టిన విషయం తెలిసిందే.

Related posts