telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేటింగ్ లైఫ్ బోర్ కొడితే పెళ్లి.. షాకిచ్చిన నయన్ బాయ్ ఫ్రెండ్

nayanatara love story as movie

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ డైరెక్ట‌ర్ విఘ్నేశ్‌తో ప్రేమ‌లో ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. “నాన్ రౌడీ థాన్” సినిమా స‌మ‌యంలో డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్‌తో న‌య‌న ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ డైరెక్ట్‌గా ఎక్కడా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పుకోలేదు కానీ.. ఇన్ డైరెక్ట్‌గా తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప‌లు మార్లు తెలియ‌జేశారు. న‌య‌న‌తార‌, విఘ్నేశ్ కలిసి చట్టపట్టాలేసుకు తీసిరుగుతున్న ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీరిద్ద‌రూ ఈ ఏడాదిలోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా విఘ్నేశ్ మాట్లాడుతూ “నయన్, నేను ఇద్దరం ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్నాం. ప్రస్తుతం మేము డేటింగ్ లైఫ్ ను గడుపుతున్నాం. ఒకవేళ మాకు బోర్ కొడితే పెళ్లి చేసుకుంటాం. లేదంటే ఇప్పట్లో మా పెళ్లి లేనట్టే” అని షాక్ ఇచ్చాడు. ఇక తాను తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సమంత నటిస్తున్నారని, కరోనా వల్ల ఆగిన షూటింగ్ ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని విఘ్నేశ్ తెలిపాడు.

Related posts