telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కన్యాకుమారిలో వెనక్కి వెళ్తున్న సముద్రం.. సునామీ భయం ?

తమిళనాడులోని కన్యా కుమారి తీరంలో రెండు రోజులుగా సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు ఇప్పుడు టెన్షన్ కలిగిస్తున్నాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే ఈ ప్రాంతాన్ని త్రికడలి సంగమంగా పిలుస్తారు. గత గురువారం సాయంత్రం అకస్మాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లింది. రాత్రంతా అలాగే ఉన్న సముద్ర మట్టం మళ్ళీ ఉదయం యథాస్థితికి చేరింది.

 

శుక్రవారం రాత్రి మళ్లీ తగ్గింది, ఉదయం యథాస్థితికి చేరింది. నీళ్లు వెనక్కి వెళ్లిన సమయంలో తీరంలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహం వద్ద రాళ్ల గుట్టలు కనిపించాయి. 2004లో సునామీకి ముందు సముద్రం ఇలాగే వెనక్కి వెళ్లిందని గుర్తు చేస్తున్నారు జాలర్లు. అయితే అలా టెన్షన్ పడవద్దని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అక్కడి లోకల్ వాళ్ళు మాత్రం ఇలా వెళ్ళడం సునామీకి సంకేతం ఏమో అని టెన్షన్ పడుతున్నారు.

Related posts