telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రం సంచలన నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు

students masks exams

సిబీఎస్సీ పదో తరగతి పరీక్షలలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సెకండ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు… రద్దు చేయడమే కాకుండా సీబీఎస్సీ 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది కేంద్రం. ఇవాళ పీఎం మోడీ సమీక్ష అనంతరం… ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర విద్యా శాఖ. జూన్ 1వ తేదీ అయిన తర్వాత.. అప్పటి పరిస్థితితులను బట్టి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకోనిన్నట్లు కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. ఇక  12 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్పుడ‌వి వాయిదా ప‌డ్డాయి. ప‌రీక్ష‌లు తిరిగి నిర్వ‌హించే ముందు క‌నీసం 15 రోజులు ముందు నోటీసు ఇవ్వ‌నున్నారు. ఇంటెర్న‌ల్ అసెస్‌మెంట్ ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్రమోట్ చేస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ వెల్ల‌డించారు. ఒక‌వేళ ఎవ‌రైనా విద్యార్థి అసెస్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉంటే ఆమె/అత‌డు ప‌రిస్థితులు మెరుగుప‌డిన త‌ర్వాత పరీక్ష‌లు రాయ‌వ‌చ్చ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

Related posts