కరోనా వైరస్ ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారిని చాలా దేశాలు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. చైనా తరువాత ఈ వైరస్ యూరప్ దేశాల్లోని ఇటలీలో ఎక్కువగా నమోదైంది. మొదట ఈ వైరస్ గురించి ఇటలీ పెద్దగా పట్టించుకోలేదు. సీరియస్ గా తీసుకునే సమయానికి భారీ సంఖ్యలో కేసులు నమోదవడం మొదలుపెట్టాయి. వయసు మళ్ళిన వ్యక్తులు ఇటలీలో ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా లంబార్డీ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పాజిటివ్ కేసులు, మరణాలు ఈ ప్రాంతం నుంచే సంభవించాయి. చైనాలో కేసులు మొదలైనప్పుడే కేర్ తీసుకొని ఉంటె ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇటలీ ప్రజలు వాపోతున్నారు. లంబార్డీలోని బెర్గామో ప్రాంతానికి చెందిన 500 మంది ప్రజలు ప్రధానికి వ్యతిరేకంగా కోర్టులో కేసును దాఖలు చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన తమ ఆప్తులను కోల్పోయామని, తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్లు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేసును ఫైల్ చేశారు. మరి ప్రజలు దాఖలు చేసిన కేసుపై ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త నేటిన్ట్లో వైరల్ అవుతుంది.
previous post
కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది: పవన్