telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ భీష్మ .. ఫస్ట్ లుక్ అదుర్స్ ..

bheeshma movie first look

నితిన్ యువ కథానాయకుల రేసులో ఎంతమాత్రం వెనకబడకుండా తన దూకుడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా డీలాపడిపోకుండా మళ్లీ హిట్ కొట్టేస్తూ పైకి లేస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన ‘భీష్మ’ సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ రోజున నితిన్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘భీష్మ’ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

bhishma movie first lookaతాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ను బట్టి .. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. టైటిల్ ను .. పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, రష్మిక కథానాయికగా అలరించనుంది.

Related posts