telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దాసరి నారాయణ రావు 4వ వర్ధంతి : ప్రముఖుల నివాళులు

150కి పైగా సినిమాలకు దర్శకత్వం.. 53 సినిమాలకు నిర్మాత.. 250కి పైగా సినిమాలకు సంభాషణల రచయిత… ఎన్నో సినిమాల్లో నటుడిగా దాసరి నారాయణ రావు తనదైన ముద్ర వేసుకున్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి ట్రాక్ రికార్డు అంటే నమ్మశక్యం కాదు. అత్యధిక సినిమాలకు దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన… వీటన్నింటికీ మించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఒక శక్తిగా వెలుగొందారు. అయితే ఇవాళ దాసరి నారాయణ రావు గారి 4వ వర్ధంతి. ఈ సందర్భంగా దాసరి అరుణ్ కుమార్, ఫెడరేషన్, చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫెడరేషన్ సెక్రటరీ PSN దొర, జనరల్ కౌన్సిల్ సభ్యులు, మరియు చిత్రపురి కమిటీ సభ్యులు మరియు సినీ పెద్దలు, వారి అభిమానులు కలిసి ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని వారి విగ్రహానికి పూలమాలలతో ఈ రోజు ఉదయం 10 గంటలకు దాసరి నారాయణ రావుకు నివాళులు అర్పించారు.

Related posts