జగపతిబాబు తన కొత్త అల్లుడు కార్తికేయను సంక్రాంతికి పండుగకు తన ఇంటికి ఎంతో సంతోషంగా స్వాగతించారు. ఇటీవల జైపూర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయతో జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజ ప్రసాద్ వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత ఇటీవలే హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఈ కొత్తజంట సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జగపతిబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి విచ్చేశారు. జగపతిబాబు “అల్లుడుగారు మా జీవితంలోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది… వెల్కమ్ అల్లుడుగారు…” అని ట్వీట్ చేస్తూ పూజ, కార్తికేయతో పాటు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఆ హడావుడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా.
. @RVRPRO Hyderabad have captured some wonderful moments from Pooja and Karthikeya’s wedding celebrations!!!
Now our family is complete with Alludu garu”s family into our lives😊
welcome Alludu garu @ssk1122 pic.twitter.com/Skw5gZOH2L— Jaggu Bhai (@IamJagguBhai) January 11, 2019
కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్