మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దీనికి కారణం నటుడు నరేషే అని ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఆరోపించారు. ఎవరైనా సభ్యులకు సేవ చేయాలనే ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంటారని అన్నారు. ప్రస్తుతం బరిలో దిగిన రెండు ప్యానల్స్ మేనిఫెస్టోలోని అంశాలను తాను ఎప్పుడో ప్రారంభించినట్లు తెలిపారు. ఈసారి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ‘మా’ సభ్యులకు సేవ చేయాలని రెండు ప్యానల్స్ సభ్యులు ఆశిస్తున్నారు.
అయితే మా అధ్యక్ష పదవి రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచితే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేరు. నాకున్న అనుభవంతో చెబుతున్నాను అన్నారు శివాజీ రాజా. అలాగే సినీ పెద్దలను కూర్చోపెట్టి ఈ విషయంపై చర్చించాలని ఇద్దరి ప్యానల్స్‌కు సేవ చేసే అవకాశం కల్పించాలని. రెండేళ్లు విష్ణు, మరో రెండేళ్లు ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కొత్త పంథాను తెరపైకి తెచ్చారు. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవని అన్నారు.