telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రశాంతంగా ప్రారంభమైన .. ఆఖరి ఘట్టం..

last schedule polling going on

నేటితో దేశంలో ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తోపాటు ఏడు రాష్ట్రాల్లో నేడు తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 59 నియోజకవర్గాల్లో 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల్లో 483 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ధన ప్రవాహం కారణంగా తమిళనాడులోని వెల్లూరు స్థానం ఎన్నిక రద్దైంది. ఇక, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండడంతో జనం ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఆరు గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఈ దశలో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, చండీగఢ్‌లలోని స్థానాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి కూడా నేడే పోలింగ్ జరగనుంది. అలాగే, రవిశంకర్‌ ప్రసాద్‌, శతృఘ్న సిన్హా, మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌, అనురాగ్‌ ఠాకూర్‌, మనోజ్‌ సిన్హా వంటి ప్రముఖులు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ బరిలో ఉన్న వారణాసిపైనే ఇప్పుడందరూ దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ మోదీకి ప్రత్యర్థులుగా ఏకంగా 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Related posts