telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన విజయ్ దేవరకొండ

vijay-devarakonda

కరోనా కారణంగా షూటింగ్‌లకు విరామం దొరకడంతో నిత్యం బిజీబిజీ షెడ్యూల్‌తో ఉండే సెలబ్రిటీలంతా ఇంట్లో కుటంబంతో సరదాగా గడుపుతున్నారు. ఇంటిని శుభ్రం చేయడం, వంటలు చేయడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, గతకాలపు జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటివి చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. తాజాగా.. బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కువిజయ్ దేవరకొండను నామినేట్ చేసారు కొరటాల శివ. దీంతో విజయ్ దేవరకొండ కొరటాల శివ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసాడు. అంతేకాదు ఇంట్లో పనులు చేసాడు. ఈ సందర్భంగా ఇల్లు శుభ్రం చేయడంతోపాటు బాసాన్లు తోమడం.. బట్టలు వాషింగ్ మిషన్‌లో వేయడంతో ఇంట్లో తమ్ముడికి అమ్మకు తాను చేసిన వంటను తినిపించాడు. ఈ చాలెంజ్‌కు మహానటిలో తనతో కలిసి యాక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్‌కు ఈ ఛాలెంజ్ విసిరాడు. ఇక దుల్కర్ ఈ ఛాలెంజ్‌ను ఏ రకంగా చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ యేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 

Related posts