telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజమండ్రిలోనూ కరోనాకు మందు.. భారీగా క్యూ లైన్

ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది.  అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  కృష్ణపట్నం కరోనా మందులానే రాజమండ్రిలోనూ మహమ్మరికి మందు తయారు చేస్తున్నారు. ఈ కరోనా మందును ఆయుర్వేద వైద్యుడు వసంత్ కుమార్ తయారు చేస్తున్నారు. 30 ఏళ్లుగా వసంత్ కుమార్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు.అదే అనుభవంతో వసంత్ కుమార్ కూడా కరోనాకు మందు తయారు చేస్తున్నాడు. అన్ని వనములికలతో చేస్తున్న ఈ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని వసంత్ కుమార్ చెబుతున్నాడు. వసంత్ కుమార్ పై నమ్మకంతో చాలా మంది అతని దగ్గరికి వస్తున్నారు. ప్రతి రోజు 100 నుంచి 200 మందికి ఈ కరోనా మందును ఇస్తున్నాడు వసంత్ కుమార్. ప్రభుత్వం సహకరిస్తే.. ఇంకా వృద్ది చేస్తానని వసంత్ కుమార్ పేర్కొన్నాడు. అయితే వసంత్ కుమార్ తయారు చేసే కరోనా మందుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts