కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయోగాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ మధ్యంతర ఫలితాలు విడుదల అయ్యాయి.’ఏడీ 26. సీఓవీ2.ఎస్’ వ్యాక్సిన్లకన్నా ఈ వ్యాక్సిన్ బలమైన రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తోందని తెలుస్తోంది. రెండు డోస్ ల స్థానంలో ఒక్క డోస్ ఇచ్చినా, సరిపోతుందని ట్రయల్స్ నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ వ్యాక్సిన్ సింగిల్ డోస్ కోతులను కరోనా నుంచి రక్షించడంలో పూర్తి విజయవంతం కావడంతో తొలి దశలో 1000 మంది ఆరోగ్య వంతులపై ప్రయోగించారు.ప్రస్తుతం విడుదలైన వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో, తుది దశలో 60 వేల మందిపై ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధమైంది. ఈ మేరకు దరఖాస్తు చేశామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.