telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

కరోనా కరోనా అని గావు కేకలు.. భారతీయునికి జైలు శిక్ష

ARREST crime

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న నేపథ్యంలో సింగపూర్ కరోనా కరోనా అని ఓ భారతీయుడుగావు కేకలు పెట్టడంతో అక్కడి పోలీసులు పట్టుకుని రెండు నెలల జైలుశిక్ష వేశారు. చాంగీ ఎయిర్‌పోర్టు హోటల్ లో జస్విందర్‌సింగ్ మెహర్‌సింగ్ (52) ఏదో వెర్రి లేచినట్టుగా ఒక్కసారిగా కరోనా, కరోనా అని కేకలు వేశాడు. అంతేకాకుండా హోటల్ ఫ్లోరింగ్ మీద ఎడాపెడా ఉమ్మేశాడు. సింగపూర్ పోలీసులు సింగ్‌ను పట్టుకుని జైలుశిక్ష విధించారు.

ఇంతకూ మన సింగ్ వింత ప్రవర్తనకు కారణం తెలుసా? ఆకలితో నకనకలాడుతూ ఏదైనా తిందామని రెస్టారెంట్‌కు వెళితే అప్పటికే కట్టేశామని చెప్పారట. దాంతో ఒళ్లుమండిపోయి మనవాడు ఖాళీ ప్లేట్లను, టేబుళ్లను చిందరవందర చేశాడు. అంతటితో ఊరుకోకుండా నేల మీద ఉమ్మేయడం, కరోనా కరోనా అని గావు కేకలు పెట్టడంతో ఊచలు లెక్కిస్తున్నాడు.

Related posts