telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ కోసం వయోలిన్ ప్లే చేసిన కీర్తి సురేశ్

Keerthy-Suresh

జూన్ 22న స్టార్ హీరో ఇళ‌య‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన రోజు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోవటం స‌రికాద‌ని భావించిన విజ‌య్‌.. త‌మ ఫ్యాన్స్ ను కూడా రిక్వ‌స్ట్ చేశాడు. క‌రోనా నేప‌థ్యంలో ఎవ‌రూ పుట్టిన రోజు వేడుక‌లు జర‌ప‌వ‌ద్ద‌ని కోరారు. అయితే అభిమానులు, సెలబ్రెటీలు సోషల్‌మీడియాలో పోస్టులతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నటి కీర్తి సురేశ్‌ మాత్రం విజయ్‌ కోసం తాను వయోలిన్‌ ప్లే చేస్తున్న వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. ‘జీవితం చాలా చిన్నది నన్బా.. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి.. హ్యాపీ బర్త్‌ డే విజయ్‌ సార్‌.. మీ బర్త్‌డే సందర్భంగా మీకోసం చిన్న వీడియో’ అని ట్యాగ్‌ జత చేసింది.

Related posts