telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాషింగ్టన్‌ : … అభిశంసన తీర్మానానికి … సభ ఆమోదం …

america senate against to trump on weapon sale

ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు బుధవారం ఆయనపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు. అక్కడ కూడా ఈ తీర్మానం ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో ట్రంప్‌ అభిశంసనకు గురయ్యే అవకాశాలు దాదాపుగా లేవు.

వచ్చే నెలలో ఆయన ఎగువసభ అయిన సెనేట్‌లో విచారణను ఎదుర్కోనున్నారు. మరోవైపు, తనపై ప్రారంభించిన అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి ట్రంప్‌ ఘాటు లేఖ రాశారు. తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Related posts