telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిచ్చగాడు-2” ఫస్ట్ లుక్

bichagadu-2

విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ ని అద్భుతంగా చూపించి ప్రేక్షకులను ఆకటుకున్నారు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాడు విజయ్. ఇక ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా “బిచ్చగాడు-2” కి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో తీస్తున్నారు. అయితే “బిచ్చగాడు” సినిమాకు దర్శకత్వం వహించిన శశి కాకుండా ప్రియా కృష్ణస్వామి అనే దర్శకుడు “బిచ్చగాడు-2” తెరక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2021లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts