telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకనిర్మాతలు చెప్పేదొకటి చేసేది మరొకటి : శ్రీయ శరణ్

sriya

తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ టాప్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీయ శరణ్ ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 40 ఏళ్ల ప్రాయంలోనూ హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. అయితే మంచి అవకాశం వస్తే మళ్ళీ వెండితెర జోష్ కొనసాగిస్తా అంటోంది కానీ, సినిమా మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు శ్రీయ. ఈ క్రమంలోనే కొందరు దర్శకనిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. కొంతమంది దర్శకనిర్మాతలు చెప్పే కథ ఒకటి, తీసే కథ మరొకటిగా ఉంటోందని, ఇటీవలి కాలంలో అన్నీ అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని అంటోంది శ్రీయ. ఏదో ఒకటి రెండు లైన్ల స్టోరీలైన్స్ చెప్పి మోసం చేస్తున్నారని వాపోయింది. అందుకే వచ్చిన కథలన్నీ ఓకే చేయడంలేదని, పూర్తి కథ విన్నాకే ఓకే అంటానని శ్రీయ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల జోష్ తగ్గించింది.ప్రాధాన్యం వున్న ఐటం సాంగులు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది.

Related posts