స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణం బాలీవుడ్ ప్రముఖులే అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించరని ఎందరో హీరో హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు. అలాంటి వారి వల్లే సుశాంత్ వంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పై ప్రస్తుతం విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం సినీ ప్రముఖుల వారసులతో మాత్రమే ఆయన సినిమాలు తీస్తున్నాడు. స్టార్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడనికి కరణ్ నే ఎంచుకుంటారు. ఈ నేపథ్యం లోనే కరణ్ బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించడం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. కరణ్ జోహార్ కొన్నాళ్ల పాటు తన బ్యానర్ లో స్టార్ వారసుల సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్లాన్ చేసినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడట కరణ్ జోహార్. మరి ఏం జరుగుతుందో చూడాలి.