నేడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దంపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె విద్యార్థులకు పాఠాలు బోధించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ఆంగ్లంలో పాఠాలు చదివించి వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు వెంటవెంటనే సమాధానాలు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు.
5వ తరగతి చదువుతున్న అంజిత్‌కుమార్ అనే విద్యార్థి చేత ఆంగ్ల పాఠాలు చదివించారు. 1వతరగతి చదువుతున్న హర్షిణీ అనే విద్యార్థితో ఆంగ్ల అక్షరాలు బ్లాక్‌బోర్డ్‌పై రాయించారు. స్కూల్ టీచర్ల బోధనా తీరుపై సంతృప్తి చెంది హెచ్‌ఎం శ్రీలతను అభినందించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలకు ప్రహరీ చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు.