telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురంలో : “రాములో రాములా… ” ఖాతాలో అరుదైన రికార్డు

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `అల వైకుంఠపురములో..`. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ రీమేక్‌లో నటించేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. తమన్ సంగీతమా అందించిన ఈ చిత్రంలోని పాటలు ఎంతటి అలజడి సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా.. ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలైతే సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. యూ ట్యూబ్ వరల్డ్ లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇంకా చెప్పాలంటే… మెలోడియస్ గా సాగిన ‘సామజవరగమన’ కంటే పార్టీ సాంగ్ గా తెరకెక్కిన ‘రాములో రాములా’ కుర్రకారుని ఓ స్థాయిలో ఉర్రూతలూగించింది. అంతేకాదు… అనతి కాలంలోనే యూ ట్యూబ్ ముంగిట 200 మిలియన్ వ్యూస్ పొందింది. సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ విజయాన్ని సాధించింది.

Related posts