telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా సుమంత్ “కపటధారి” టీజర్

Kapatadhari

అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో “కపటధారి” అనే సినిమా చేస్తున్నాడు. “కపటధారి” చిత్రం ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామ కాగా, కన్నడంలో సూపర్‌ హిట్ అయిన ‘కావలుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్‌లో సుమంత్‌, నాజర్‌, నందిత, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జయప్రకాశ్‌, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విజయ్ ఆంటోనితో ‘భేతాళుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. టీజర్ చూస్తుంటే మర్డర్ మిస్టరీగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts